22 నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (09:10 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యం తిరుమల శ్రీవారి క్షేత్రంలో మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఏటా ఈ కార్య‌క్ర‌మాన్ని జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా నిర్వహిస్తున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో ఈ నెల22 నుంచి 24 వర‌కు జ్యేష్ఠాభిషేకం కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. అభిషేకాలతో శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఉత్సవం సందర్భంగా ఆలయంలో ఈనెల 24న వర్చువల్‌ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది.
 
ఇందులోభాగంగా మొదటిరోజు మలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంత‌రం వజ్రకవచం అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు. 
 
రెండోరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగింపు నిర్వహిస్తారు. చివరిరోజైన 24న తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగించనున్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా

తర్వాతి కథనం
Show comments