Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశిపై టిటిడి తీసుకున్న నిర్ణయం భేష్ - కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (17:15 IST)
ఈనెల 25వ తేదీ ముక్కోటి ఏకాదశి సంధర్భంగా పది రోజుల పాటు భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్సనం కల్పించడం ఆనందదాయకమన్నారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. టిటిడి చేస్తున్న కార్యక్రమాల ద్వారా భక్తులకు మేలు కలగాలని కోరుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని ఈరోజు మధ్యాహ్నం కంచి పీఠాదిపతి దర్సించుకున్నారు. 
 
ఆలయం వద్ద టిటిడి ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో అనేక వ్రత, పూజాది ఉత్సవాలను భక్తుల సంక్షేమం కోసం టిటిడి నిర్వహిస్తుండడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్తీక మాసంలో దీపోత్సవం సందర్భంగా పీఠాధిపతులను టిటిడి ఆహ్వానం మేరకు తిరుమలకు వచ్చామన్నారు. 
 
కార్తీక మాసంలో భగవద్గీత, సుందరకాండ పారాయణం, విరాటపర్వం ప్రవచనాన్ని ప్రతినిత్యం మండపంలో శివకేశవ విశేష పూజాది కార్యక్రమాలు టిటిడి నిర్వహిస్తోందన్నారు. కరోనా కాలంలో కూడా తిరుమలలో లోక కళ్యాణార్థం, భక్తుల ఆరోగ్యార్థం టిటిడి ఎటువంటి లోటు లేకుండా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

తర్వాతి కథనం
Show comments