టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

సెల్వి
బుధవారం, 22 అక్టోబరు 2025 (17:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భారీ విరాళాలు అందాయి. నవంబర్ 2024, అక్టోబర్ 2025 మధ్య కాలంలో టీటీడీతో పాటు దానికి చెందిన వివిధ ట్రస్టులకు రూ.918.6 కోట్ల విరాళాలు అందాయి. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ట్రస్టులకు విరాళాలు క్రమంగా పెరిగాయని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా విరాళాలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. 
 
వచ్చిన మొత్తం విరాళాలలో, రూ.579.38 కోట్లు ఆన్‌లైన్ ద్వారా, రూ.339.20 కోట్లు ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా వచ్చాయని నాయుడు తెలిపారు. ట్రస్టులలో, శ్రీ వెంకటేశ్వర (ఎస్వీ) అన్నదానం ట్రస్ట్ అత్యధికంగా దాదాపు రూ.339 కోట్లు అందుకుంది. తరువాత శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.252 కోట్లకు పైగా, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి దాదాపు రూ.98 కోట్లు అందాయని ఆయన చెప్పారు. 
 
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ దాదాపు రూ.67 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ రూ.56 కోట్లకు పైగా, ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ రూ.33.47 కోట్లు, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (బిఐఆర్ఆర్డి) ట్రస్ట్ దాదాపు రూ.30 కోట్లు, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్ రూ.20.46 కోట్లు విరాళంగా ఇచ్చాయని నాయుడు తెలిపారు. 
 
ఇంకా, ఎస్వీ వేద పరిరక్షన ట్రస్ట్ కు రూ.13.87 కోట్లు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ)కు రూ.6.29 కోట్లు, శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్విఐఎంఎస్) కు రూ.1.52 కోట్లు విరాళంగా ఇచ్చారని బీఆర్ నాయుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

19-10-2015 నుంచి 25-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

TTD: తెలంగాణ భక్తుల వద్ద రూ.4లక్షల మోసం-దళారులను నమ్మొద్దు.. టీటీడీ వార్నింగ్

18-10-2025 శనివారం దినఫలాలు - ఆస్తి వివాదాలు జటిలమవుతాయి....

19న జనవరి కోటా శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?

తర్వాతి కథనం
Show comments