Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

సెల్వి
బుధవారం, 22 అక్టోబరు 2025 (08:59 IST)
అక్టోబర్‌ 22వ తేదీ నుంచి శివారాధనకు  విశిష్టమైన కార్తీక మాసం 2025 ప్రారంభమవుతుంది. నవంబర్‌ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ మాసం ఎంతో విశిష్టమైనదని స్కంధ పురాణంలో పేర్కొన్నారు. 
 
ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు ఇలా భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది. దేశం నలుమూలలా ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళ పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. 
 
కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని.. ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. 
 
ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు. అనంతరం దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో దీప దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతి రోజూ దీపం దానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. 
 
ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి వేళ 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో, పారే నీటిలో వదులుతారు. సోమవారాలు కఠిన ఉసవాస దీక్షను ఆచరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

తర్వాతి కథనం
Show comments