Lakshmi Narayana Raja Yoga, Trigrahi Yoga and Gajakesari Yoga on Diwali
దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా దీపావళి నుంచి ఆరు నెలల వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ఆ అదృష్టం ఏ రాశుల వారికి వరిస్తుందో తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా దీపావళి నుండి వృషభ రాశి జాతకులకు కలిసొస్తుంది. దీపావళి నుంచి ఆరు నెలల కాలం వీరికి అనుకున్న కార్యాల్లో విజయం తథ్యం.
డబ్బుకు, సంతోషానికి లోటు లేకుండా ఉంటుంది. దీపావళి నుండి ఆరునెలల పాటు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులు అన్నీ రంగాల్లో రాణిస్తారు. మిధున రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన కార్యం విజయవంతం అవుతుంది.
అలాగే తులా రాశి జాతకులు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొందుతున్నారు. ఈ సమయంలో వీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో అనుకున్నది సాధిస్తారు. అలాగే దీపావళి నుండి ఆరు నెలల పాటు ధనుస్సు రాశి జాతకులకు లక్ష్మీ నారాయణ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.
దీపావళి నుండి ఆరు నెలలపాటు కుంభరాశి జాతకులకు అదృష్టం తలుపు తడుతుంది. ఎప్పటినుంచో పరిష్కారం కానీ సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం. అలాగే ఈ రోజున త్రిగ్రహి యోగం ఏర్పడబోతోంది.
ఈ యోగం గ్రహాలకు రాజు అయిన సూర్యుడు, వ్యాపార కారకుడు అయిన బుధుడు, ధైర్యం, క్రమశిక్షణలకు ప్రతీక కుజుడుని కలవనున్నారు. దీంతో తులారాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.
ఈ యోగం ప్రభావంతో మూడు రాశుల వారి అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. బుధుడు, కుజుడు, సూర్యుడు కలవడం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలం. ప్రేమ పెళ్లి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు లాభదాయకం.
ఇంకా కర్కాటక రాశి వారికి త్రిగ్రహి యోగం శుభాలను ఇస్తుంది. లాటరీల్లో లాభం. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు చేసే అవకాశాలున్నాయి. ఇక సింహ రాశి వారికి త్రిగ్రహి యోగం విలువైన వస్తువులను కొనేలా చేస్తుంది. పాత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి.
అదేవిధంగా దీపావళి సందర్భంగా గజ కేసరి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ గజ కేసరి యోగం కారణంగా కీర్తి, సంపద, గౌరవం పెరుగుతుంది. దీపావళికి తర్వాత ఏర్పడే ఈ గజ కేసరి యోగం కారణంగా అదృష్టం వరిస్తుంది. చంద్రుడు, గురు గ్రహం కలయిక వల్ల ఏర్పడే ఈ గజ కేసరి యోగం ద్వారా మేషరాశికి అనుకున్న కార్యాల్లో విజయం తథ్యం. వ్యాపారంలో వృద్ధి. వ్యక్తిగతంగా అన్నీ రంగాల్లో రాణిస్తారు. కుటుంబంతో సంతోషంగా వుంటారు.
అలాగే కన్యారాశి జాతకులు గజ కేసరి యోగం కారణంగా అదృష్టం వరిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గురువుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. సంపద లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఇంకా కర్కాటక రాశి వారికి ఈ గజ కేసరి యోగం ద్వారా పెట్టుబడులతో ఆదాయం బాగుంటుంది. వ్యాపారంలో అభివృద్ధి చేకూరుతుంది. కొత్త అవకాశాలు చేకూరుతాయి. వ్యాపారంలో లాభం పెంపొందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పొదుపు సాధ్యమవుతుంది. కుటుంబంతో సుఖంగా వుంటారు.