Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

Advertiesment
Astrology

రామన్

, గురువారం, 16 అక్టోబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారదక్షతతో రాణిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనులు సానుకూలమవుతాయి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వింటారు. యత్నాలు విజయవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రతి విషయంలోను మీదే పైచేయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. కొత్త విషయం తెలుసుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. యత్నాలు ఫలిస్తాయి. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు ప్రయోజనకరం. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పిల్లల దూకుడు అదుపు చేయండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కష్టం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారునుకూలత ఉంది. సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గ్రహం ప్రశాంతంగా ఉంటుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెదురవుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. పిల్లలకు మంచి జరుగుతుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రయాణం తలపెడతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. నోటీసులు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ ఓర్పునకు పరీక్షా సమయం. విమర్శలు పట్టించుకోవద్దు. సామరస్యంగా మెలగండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..