శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు సిద్ధం చేసిన తితిదే - తొలి 3 రోజులు వారికే..

Webdunia
గురువారం, 14 మే 2020 (16:02 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఫలితంగా గత 50 రోజులకు పైగా తిరుమల కొండపైకి భక్తులు ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. కేవలం తిరుమల గిరిపై నివాసిస్తున్న ఉద్యోగులు, తితిదే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17వ తేదీన లాక్డౌన్ ఎత్తివేసిన పక్షంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. 
 
వీటిలోభాగంగా, తొలి మూడు రోజుల పాటు కేవలం తితిదే సిబ్బందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తిరుపతి, తిరుమల ప్రజలకు 15 రోజుల పాటు దర్శనం అందుబాటులోకి తెస్తారు. అదీకూడా ప్రయోగాత్మకంగా ఈ దర్శనం కల్పించనున్నారు.
 
అంతేకాకుండా, రోజుకు కేవలం 14 గంటల పాటు కేవలం 500 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ లెక్కన వారానికి 7 వేలు మంది మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఇతర భక్తుల కోసం దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విక్రయించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: ఫిబ్రవరి 11 నుంచి మున్సిపల్ ఎన్నికలు.. ఫలితాలు ఫిబ్రవరి 13న విడుదల

ఎపుడైనా.. ఎక్కడైనా.. ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్...

ఐదేళ్ల బాలికపై వీధికుక్క దాడి.. చెంపపై కరిచింది..

లోకేశ్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ : బీద రవిచంద్ర

బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవరుకి గుండెపోటు, ఏం చేసాడంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

తర్వాతి కథనం
Show comments