Publish Date: Fri, 01 May 2020 (21:17 IST)
Updated Date: Fri, 01 May 2020 (21:19 IST)
తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎప్పుడు తెరుస్తారు. ఆ స్వామివారిని ఎప్పుడు కనులారా దర్సించుకుందామన్న ఆసక్తి, ఆత్రుత ప్రతి ఒక్కరిలోను ఉంది. ప్రతిరోజు లక్షలాది భక్తులు దర్సించుకునే తిరుమల శ్రీవారి ఆలయం కరోనా వైరస్ కారణంగా భక్తులను నిలిపివేశారు. భక్తులను దర్సనానికి అనుమతించకుండా సుమారుగా 40 రోజులకు పైగానే అయ్యింది.
అయితే తాజాగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. తాను కూడా శ్రీవారిని ఎంతో భక్తిభావంతో కొలుస్తానని.. టిటిడి ఛైర్మన్‌గా ఉండడం తన పూర్వజన్మ సుక్రుతమన్నారు. అయితే శ్రీవారి ఆలయంలోకి భక్తులను ఎప్పుడు అనుమతించాలా అన్న విషయం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మీదే ఆధారపడి ఉంటుందన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందన్నారు. ఆలయంలోకి భక్తులను అనుమతిస్తే ఖచ్చితంగా దర్సన విధివిధానాల్లో మార్పు ఉంటుందని చెప్పారు. అయితే ఎలాంటి దర్సనం భక్తులకు ఇక మీదట కల్పించాలి అన్న విషయంపై కూడా చర్చలు జరుపుతున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.
జె
Publish Date: Fri, 01 May 2020 (21:17 IST)
Updated Date: Fri, 01 May 2020 (21:19 IST)