పారదర్శకంగానే తితిదే నిధుల డిపాజిట్ : ఈవో అనిల్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి చెందిన నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు, ఈ వ్యవహారం అంతా పారదర్శకంగానే సాగినట్టు తితిదే ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. తితిదే నిధులు డిపాజిట్లలో అవకతవకలు జరిగినట

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (10:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి చెందిన నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు, ఈ వ్యవహారం అంతా పారదర్శకంగానే సాగినట్టు తితిదే ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. తితిదే నిధులు డిపాజిట్లలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. 
 
టీటీడీ నిధులను వివిధ బ్యాంక్‌లలో జమచేయడంపై వచ్చిన ఆరోపణలలో వాస్తవంలేదన్నారు. టీటీడీ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ నూచనలను అనుసరించి ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల జాబితా ప్రకారం వచ్చిన సీల్డ్‌ బిడ్‌ కొటేషన్లను మార్చి 24వ తేది పరిశీలించామన్నారు. 
 
వచ్చిన కొటేషన్లను పరిశీలించి మరింత మెరుగైన వడ్డీ రేట్లను కోరుతూ మార్చి 26వ తేదీన మరోసారి బ్యాంకుల నుండి వచ్చిన సీల్డ్‌ బిడ్‌ కొటేషన్లను పరిశీలించినట్లు తెలియజేశారు. నిబంధనలను పాటిస్తూ టీటీడీకి అత్యధిక శాతం వడ్డి ఇవ్వడానికి అంగీకరించిన బ్యాంకులలో మాత్రమే జమ చేశామన్నారు.
 
ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి వడ్డీల రూపంలో వచ్చే రూ.4 వేల కోట్లలో రూ.3 వేల కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులలోనూ, రూ.1000 కోట్లను ప్రైవేట్‌ బ్యాంక్‌లలో డిపాజిట్‌ చేయాల్సి ఉందన్నారు. అందులోభాగంగా విజయా బ్యాంక్‌ 7.27 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 7.11 శాతం, ఆంధ్రా బ్యాంక్‌ 7.32 శాతం వడ్డీని ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. 
 
అధిక వడ్డీని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆంధ్రా బ్యాంక్‌లో రూ.3,000 కోట్లు (7.32 శాతం వడ్డ్డీకి), ఇండసిండ్‌ బ్యాంక్‌లో రూ.1,000 కోట్లను (7.66 శాతం) డిపాజిట్‌ చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 10,589 కోట్లు టీటీడీ నిధులను వివిధ బ్యాంకులలో డిపాజిట్‌ చేసినట్టు ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

తర్వాతి కథనం
Show comments