Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుకొండలవాడా గోవిందా గోవిందా, బ్రహ్మోత్సవాలు ఆ తేదీల్లోనే...

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (19:37 IST)
కలియుగ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తేదీని ఖరారు చేశారు. బ్రహ్మోత్సవాలు ఏవిధంగా నిర్వహిస్తారు.. అసలు గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అదే తేదీల్లో జరుగుతుందా లేదా అన్న అనుమానం కోట్లాదిమంది భక్తుల్లో ఉండేది.
 
అయితే వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టిటిడి. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీన అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.
 
బ్రహ్మోత్సవాల్లో విశేషమైన రోజుల వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన ధ్వజారోహణం, సెప్టెంబర్ 23వ తేదీన గరుడసేవ, సెప్టెంబర్ 24వ తేదీన స్వర్ణరథోత్సవం, సెప్టెంబర్ 26వ తేదీన రథోత్సవం, సెప్టెంబర్ 27వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి.
 
అయితే బ్రహ్మోత్సవాలను ఎలా నిర్వహించాలి అనే విషయంపై టిటిడి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలా.. లేక పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి నిర్వహించాలా అన్న ఆలోచనలో టిటిడి ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నెల చివరకి టిటిడికి సంబంధించిన పాలకమండలి సమావేశంలో టిటిడి అధికారులు ఇందుకు సంబంధించిన అధికారులు ఒక నిర్ణయం తీసేసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments