శ్రీవారి భక్తులు త్వరపడండి వచ్చే నెలలో శ్రీవారిని దర్సించుకోవాలంటే..?

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (20:20 IST)
కోవిడ్ కారణంగా ఆన్ లైన్ లోనే టిక్కెట్లను టిటిడి మంజూరు చేస్తోంది. ఉచిత దర్సన టోకెన్లయినా, 300 రూపాయల దర్సనం టోకెన్లు అయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఆన్ లైన్ లోనే పొందాల్సిన పరిస్థితి. అందులోను కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయాన్ని టిటిడి తీసుకుంటోంది. 

 
ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్సనం కోటాను ఈనెల 27వ తేదీన విడుదల చేసేందుకు సిద్థమైంది టిటిడి. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సనం టిక్కెట్లను ఈనెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనుంది టిటిడి.

 
అలాగే ఫిబ్రవరి నెలలో సర్వదర్సనం టోకెన్లకు సంబంధించి ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్లో టోకెన్లను అందించనుంది. పరిమిత సంఖ్యలోనే టోకెన్లను విడుదల చేయనుంది. 

 
భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్సనం టోకెన్లను పొందాలని.. కోవిడ్ వ్యాక్యినేషన్, కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. గతంలోలా సర్టిఫికెట్ తీసుకొచ్చినా టిటిడి అధికారులు చూసేవారు కాదు. కానీ ప్రస్తుతం కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేకుంటే రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉంటేనే దర్సనానికి అనుమతిస్తామని టిటిడి స్పష్టం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments