Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తజన జనసంద్రం... గరుడ వాహనంపై శ్రీవారు

కలియుగ వైకుంఠం భక్తజన సంద్రమైంది. లక్షలాది మంది భక్తులతో అనంత భక్త సాగరాన్ని తలపించింది. గోవిందా.. గోవిందా అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున రాత్రి తిరు వేంకటనాథుడు తన అనుంగు వాహనమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (21:18 IST)
కలియుగ వైకుంఠం భక్తజన సంద్రమైంది. లక్షలాది మంది భక్తులతో అనంత భక్త సాగరాన్ని తలపించింది. గోవిందా.. గోవిందా అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున రాత్రి తిరు వేంకటనాథుడు తన అనుంగు వాహనమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు ఉదయం నుంచి తిరుమలకు చేరుకున్నారు. 
 
అన్నమయ్య పేర్కొన్నట్టు ‘‘ నానా దిక్కుల నరులెల్లా..’’ రీతిలో లక్షలాది మంది భక్తజనం రావడంతో తిరుమల కొండలు భక్తగిరులుగా మారిపోయాయి. గరుడ సేవలో ధ్రువమూర్తి వేంకటేశ్వరస్వామికి, ఉత్సవమూర్తి మలయప్పస్వామికి భేదం లేదు. అందుకనే ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ఉండగా వీక్షించడం మోక్షదాయకం. మూల విరాట్టుకు నిత్యం అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల వంటి విశిష్ట అభరణాలను మలయప్పకు అలంకరిస్తారు. 
 
గరుడోత్సవాన్ని వీక్షిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శ్రీవిల్లిపుత్తూరు ఆలయం నుంచి పూలమాలలు, చెన్నై నుంచి గొడుగులను తిరుమలకు తరలించి గరుడోత్సవానికి ఉత్సవమూర్తికి అలంకరించడం విశేషం. గరుత్మంతుడు విష్ణువుకు వాహనం. అలాగే ధ్వజం కూడా. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజస్తంభంపై నుంచి యావత్‌ దేవతలకు ఆహ్వానం పలుకుతాడు. విష్ణు పురాణాన్ని శ్రీ వైకుంఠనాధుడు తొలిసారిగా గరుడినికే ఉపదేశించాడు. ఇన్ని విధాలుగా గరుడసేవ విశిష్ట సేవగా గుర్తింపబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments