Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి బ్రహ్మోత్సవాలు... బుధవారం అంకురార్పణ.. వాహన సేవలు

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేశారు. ఆపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుంది.

Advertiesment
శ్రీవారి బ్రహ్మోత్సవాలు... బుధవారం అంకురార్పణ.. వాహన సేవలు
, మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (10:55 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేశారు. ఆపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుంది.


ఇక బుధవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుండగా, రాత్రి ఏడు గంటలకు మాడ వీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు ఊరేగనున్నారు. గురువారం నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 13వ తేదీ సాయంత్రం 6.45 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 
 
ఇకపోతే 13న రాత్రి 8 గంటలకు పెద్ద శేష వాహనం‌పై శ్రీవారు ఊరేగుతారు. 14న ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, రాత్రి 8 గంటలకు హంస వాహన సేవలు జరుగుతాయి. 15న ఉదయం 9 గంటలకు సింహవాహనమ, రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహనం, 16న ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనం, 17వ తేదీ ఉదయం 9 గంటలకు మోహిని అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం, 18వ తేదీ ఉదయం 9 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 8 గంటలకు గజ వాహన సేవలుంటాయి. 
 
అలాగే 19న ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం, 20న ఉదయం 7 గంటలకు మహారథం, రాత్రి 8 గంటలకు అశ్వ వాహనం... 21వ తేదీన ఉదయం 7 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-09-2018 మంగళవారం దినఫలాలు - ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే...