ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (08:49 IST)
శ్రీవారి పుణ్యక్షేత్రం రెండు రోజులపాటు మూతపడనుంది. ఈ నెల 25వ తేదీన, నవంబరు 8వ తేదీన ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణాల సమయంలో శ్రీవారి ఆలయంలో భక్తుల సందర్శనాన్ని 12 గంటల పాటు నిలిపి వేస్తామని ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని తితిదే అధికారులు కోరారు. 
 
ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం, నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం రాహనున్నాయి. ఈ గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజులపాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తితిదే వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటల పాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలను అనుమతించబోమని తెలిపింది. 
 
గ్రహణం సమయాలు.. 
అక్టోబరు 25వ తేదీ సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. 
 
అలాగే, నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం. ఆరోజన మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణ ఘడియలు. అందువల్ల నవంబరు 8వ తేదీన 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

Jogi Ramesh: కల్తీ మద్యం కేసు: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్

Happy Bride: ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఇలానే వుంటారు.. (video)

పులి కూనలను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న సావిత్రమ్మ.. తల్లి ప్రేమంటే ఇదేనా? వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

తర్వాతి కథనం
Show comments