Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవిందుడి సన్నిధిలో గత వైభవం - భక్తులతో సందడిగా తిరుమల

గోవిందుడి సన్నిధిలో గత వైభవం - భక్తులతో సందడిగా తిరుమల
, మంగళవారం, 1 మార్చి 2022 (12:40 IST)
కలియుగం వైకుఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుగులు ఇపుడు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా తిరుమలలో భక్తుల సందడి లేదు. కానీ, ఇపుడు కరోనా ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో గోవిందుడి సన్నిధి గత వైభవాన్ని తలపిస్తుంది. 
 
గత నాలుగు రోజుల్లో ఏకంగా 2.44 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం. కరోనా వైరస్ కారణంగా గత 2020 మార్చి 21వ తేదీ నుంచి ఆలయంలోని అన్ని రకాల దర్శనాలను రద్దు చేశారు. అలా దాదాపు మూడు నెలల పాటు స్వామి వారికి అన్ని రకాల పూజలను ఏకాంతగానే నిర్వహించారు. 
 
ఆ తర్వాత దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ప్రతియేటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఆలయానికే పరిమితం చేశారు. అయితే, ఇపుడు కోవిడ్ పరిస్థితులు చాలా మేరకు చక్కబడ్డాయి. దీనికితోడు రూ.300 దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే టైంస్లాట్ సర్వదర్శన టోకెన్ల సంఖ్య కూడా పెంచారు. 
 
దీంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తలు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఏడుకొండలు ఇపుడు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు 2,44,098 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోగా, రూ.16.23 కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి