Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఐపి బ్రేక్‌ ఎల్‌-1 టికెట్లు 8 లక్ష రూపాయలు..!

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (22:31 IST)
తిరుమల శ్రీవారి సేవా టికెట్లను అధిక రేట్లకు విక్రయించే ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అది కూడా విఐపిలు దర్శనం చేసుకునే టికెట్లను వేల రూపాయల్లో ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా చేసిన బాగోతాలపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.
 
నరసారావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి తానే స్వయంగా వస్తున్నట్లు వెంకటేష్‌ అనే వ్యక్తికి ఒక సిఫారసు లెటర్‌ను ఇచ్చి పంపించాడు. అయితే వెంకటేష్‌ ఆ లెటర్‌ను తీసుకుని జెఈఓ కార్యాలయంలో టికెట్ల కోసం ధరఖాస్తు చేశాడు. ఎమ్మెల్యే పేరు మీద 8 ఎల్‌-1 విఐపి దర్శనంతో పాటు మూడు అర్చన టికెట్లు మంజూరయ్యాయి. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్యే తన పర్యటనను రద్దు చేసుకున్నాడు. ఆ విషయాన్ని వెంకటేష్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. 
 
అయితే వెంకటేష్‌ ఆ టికెట్లను ఎక్కువ రేట్లకు విక్రయించాలని నిర్ణయించుకుని నగరికి చెందిన ఒక దళారీకి బేరం పెట్టాడు. ఎల్‌1 టికెట్లను ఒక్కోటి లక్ష రూపాయలకు విక్రయించగా 3 అర్చన టికెట్లను 50 వేలకు విక్రయించేశాడు దళారీ. ఎమ్మెల్యే పేరు మీద శుక్రవారం దర్శనానికి వెళ్ళిన వారిని గుర్తించిన తితిదే సిబ్బంది అనుమానంతో ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. భక్తులను దర్శనానికి పంపించేసిన తితిదే అధికారులు టికెట్లను విక్రయించిన వారి పేర్లను కనుక్కుని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు తితిదే విజిలెన్స్ అధికారులు. దళారీలను పోలీసులు తిరుమలలోని ఒన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో విచారిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?

11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

22-02-2025 రాశి ఫలితాలు: ఖర్చులు అంచనాలను మించుతాయి

21-02-2025 రాశి ఫలితాలు, ఈ రాశివారు ఇతరుల కోసం విపరీత ఖర్చు

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?

20-02-2025 గురువారం దినఫలితాలు- ఆలోచనలు నిలకడగా ఉండవు

తర్వాతి కథనం
Show comments