అమ్మ‌వారికి వంద కేజీల కూర‌గాయ‌ల అలంక‌ర‌ణ‌

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (20:42 IST)
శాకాంబరిగా చెముడులంక ధనలక్ష్మి అమ్మవారు క‌ళ‌క‌ళ‌లాడిపోతోంది. వంద కేజీల కూరగాయలతో అలంకరణ అంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తోంది.
    
తూర్పుగోదావ‌రి జిల్లా లంక‌ గ్రామాల కూడలైన, ఆలమూరు మండలం చెముడులంక జాతీయ రహదారిపై కొలువుదీరి వున్న ధనలక్ష్మి అమ్మవారు శాకాంబరిగా దర్శనం ఇచ్చారు. ఆషాఢ మాసం శుక్రవారం వారం సందర్భంగా ఈ గ్రామ రైతులు సమకూర్చిన వంద కేజీల కూరగాయలతో అమ్మ‌వారిని అలంకరించారు.

ఆలయ ధర్మకర్త ఆ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో లంకల్లో పండే వంగ, దొండ, బెండ, మిర్చి, టమోటా,బీర,మునగ వంటి కూరగాయలతో అమ్మవారి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ పురోహితుడు ప్రభాకర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. అంతేకాదు చెముడులంక జాతీయ ర‌హ‌దారిపై వెళ్ళే ప్ర‌తి ప్ర‌యాణికుడు అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటున్నారు. శాకాంబ‌రిగా అలంక‌ర‌ణ అద్భుతంగా ఉంద‌ని వేనోళ్ళ పొగ‌డుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments