Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రావిచెట్టుకు, వేప చెట్టుకు పెళ్లి చేస్తే..?

రావిచెట్టుకు, వేప చెట్టుకు పెళ్లి చేస్తే..?
, మంగళవారం, 29 జూన్ 2021 (19:06 IST)
మూలలో బ్రహ్మ రూపాయా
మధ్యలో విష్ణు రూపిణే
అగ్రత శ్శివరూపిణే
వృక్షరాజాయతే నమః 
 
దీని ప్రకారం స్కంద పురాణం ప్రకారం రావి చెట్టు వేర్లలో విష్ణు భగవానుడు, చెట్టు కాండంలో శివుడు, చెట్టు కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలు సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతోంది. అయితే ఇటువంటి గొప్ప మహోన్నతిని కలిగిన రావి చెట్టును పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.
 
రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. ఈ రావి చెట్టు ఆకుల పై దీపారాధన చేయడం వల్ల ఏలినాటి గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలానే ఎర్రని వస్త్రం లో ముడుపు కట్టి రావి చెట్టుకి కట్టడం వల్ల సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. 
 
రావి చెట్టు ఎంతో పరమ పవిత్రమైనది అని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భాగవతంలో తెలియజేశాడు. ఎంతో పవిత్రంగా భావించే ఈ రావిచెట్టును సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు నిలయంగా భావిస్తారు. అలాగే రావి చెట్టును విష్ణు రూపంగా చెబుతారు కనుకనే రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును, రావి చెట్టును పెంచి పెండ్లి చేస్తారు. ఇలా చేసి సాక్షాత్ లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినట్టుగా భావిస్తారు.
 
రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకొని వుంది కనుకనే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇతర విధాలుగా ఉపయోగించరు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రమును పఠిస్తే ఆరోగ్యాన్ని కూడా పొందగలరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-06-2021 మంగళవారం దినఫలాలు - గణపతిని తెల్లని పూలతో ఆరాధించినా...