Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుని కటాక్షం

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (22:04 IST)
తిరుమ‌ల‌: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారంనాడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రిగింది. ఈ సందర్భంగా  శ్రీ‌రాముల‌వారు త‌న ప్రియ‌భ‌క్తుడైన‌ హనుమంత వాహ‌నంపై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు శ్రీ‌రాముని మూపున వహించి దర్శనమిస్తారు. గురు శిష్యులైన‌ శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా చేప‌డ‌తారు. 
 
ఏప్రిల్ 22న శ్రీరామ పట్టాభిషేకం...
ఏప్రిల్ 22వ‌ తేదీన గురువారం రాత్రి 8 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

తర్వాతి కథనం
Show comments