శ్రీవారి భక్తులకు శుభవార్త - ఉచిత దర్శన టిక్కెట్లు జారీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:45 IST)
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులకు ఉచిత దర్శన టిక్కెట్లను జారీచేసింది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ చేసేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి జారీ చేసే ఈ టోకన్లను తీసుకున్నవారికి బుధవారం నుంచి దర్శనం కల్పిస్తారు. 
 
అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి, సత్రాల వద్ద టోకెన్లను జారీచేస్తారు. ఈ ఉచిత దర్శనం టోకెన్ల కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా పడుతున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్ని నెలలుగా ఉచిత దర్శనం నిలపివేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో కేవలం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను జారీ చేస్తూ, వాటిని తీసుకున్న వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తూ వచ్చారు. ఇకపై, సాధారణ భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే చర్యలు తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్వేతనాగుకు ఆపరేషన్.. పడగకు గాయం అయ్యింది.. వీడియో వైరల్ (video)

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

తర్వాతి కథనం
Show comments