Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

సెల్వి
గురువారం, 26 జూన్ 2025 (18:40 IST)
ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకల వర్షం కురుస్తూనే వుంటుంది. శ్రీవారి హుండీలో రోజూ లక్షల విలువ చేసే కానుకలు వచ్చి పడుతుంటాయి. తాజాగా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. 
 
ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేశారు. ఆలయ పట్టణంలోని ఛైర్మన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తోట అందించిన విరాళాన్ని టీటీడీ అధికారులు అభినందించారు. 
 
ఇకపోతే టీటీడీ అనుబంధ ఆలయాలైన నందలూరు, తాళ్లపాకలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నందలూరులో జూలై 5 నుండి 13 వరకు, తాళ్లపాకలో జూలై 6 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

తర్వాతి కథనం
Show comments