Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (14:29 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు శుభవార్త చెప్పింది. త్వరలో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు తితిదే ఛైర్మన్ వైపీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తుండగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో అందుకు అనుగుణంగా భక్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారని… వర్షాలు తగ్గడంతో నడకదారిలో అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లోనా.. లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఇవ్వాలా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
కాగా ప్రస్తుతం టీటీడీ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేస్తోంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments