తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఏమిటో తెలుసా?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (15:25 IST)
తిరుమల : తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో స్వామి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. వారికి రెండు గంటల సమయంలోపే స్వామి దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. 
 
చలి అధికంగా ఉండటం, సెలవులు లేకపోవడంతోనే రద్దీ తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు గంటన్నర వ్యవధిలోనే దర్శనం అవుతుండగా, ప్రత్యేక, దివ్య దర్శనం భక్తులకూ అంతే సమయం పడుతోంది. అందులో కూడా క్యూ లైన్లలో నడిచి వెళ్లేందుకు పట్టేందుకు పట్టే సమయమే అధికం.
 
ఇక నిన్న స్వామివారిని 73,350 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,709 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 2.91 కోట్లుగా నమోదైంది. కాగా, తిరుమలలో రద్దీ లేదని తెలుసుకున్న స్థానిక వ్యాపారులు, తిరుపతి వాసులు, స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

రెండేళ్లలో 416మందితో డేటింగ్.. మహిళ షాకింగ్ స్టోరీ

హైదరాబాద్‌లో భూముల వేలం తిరిగి ప్రారంభం.. ప్రభుత్వం ఆమోదం

అనుమానం.. భార్యను వేధించాడు.. ఆపై రోకలితో బాది హత్య.. స్టేటస్ కూడా పెట్టాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Shukra Pradosh Vrat 2026: శుక్ర ప్రదోషం.. శ్రీ మహాలక్ష్మి కటాక్షాల కోసం..

16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

తర్వాతి కథనం
Show comments