వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే శ్రీవారి దర్శనం : తితిదే

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (13:58 IST)
ఈ నెలలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీంతో భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఏవైనా దర్శనం టికెట్లు కలిగి, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ పీసీఆర్ పరీక్ష నెగటివ్ రిపోర్టు ఉంటేనే భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని తేల్చిచెప్పింది. 
 
బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాటపై సమీక్షించేందుకు శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, టీటీడీ సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని గోపినాథ్ కోరారు. అదేసమయంలో తితిదే అధికారులు తీసుకునే చర్యలకు కొండపైకి వచ్చే భక్తులు కూడా సహకారం అందించాలని తితిదే అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

దేశంలో సుధీర్ఘ దూరం ప్రయాణించే రైలు ఏది?

అన్నీ చూడండి

లేటెస్ట్

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments