Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం దినఫలాలు - సూర్యనారాయణ పారాయణ చేసినా..

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (04:00 IST)
శ్రీ ప్లవనామ సం|| భాద్రపద ఐ|| ద్వాదశి రా.7.48 మఘ రా.211 ప.వ.1.53 ల 3.31. సా.దు.411 ల 4.59. సూర్య నారాయణ పారాయణ చేసినా అన్ని విధాలా కలిసివస్తుంది. 
 
మేషం:- పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులలో ఒకరి గురించి ఆందోళన పెరుగుతుంది. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. స్పెక్యులేషన్ కలసిరాదు. నేడు అనుకూలించని యత్నం రేపు ఫలిస్తుంది.
 
వృషభం:- విద్యార్థులకు ఏకాగ్రత, ఆసక్తి ఏర్పడుతుంది. ఆలస్యమైన అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ 
ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది. విందులలో పరిమితి పాటించండి. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి.
 
మిథునం:- ఆర్థిక విషయాలలో గోప్యంగా వ్యవహరించడి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
 
కర్కాటకం:- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలసి వస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి.
 
సింహం: - కొబ్బరి, పండ్లు, చల్లని, పానీయ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పోయిన వస్తువులు దొరకటంతో ఆనందిస్తారు. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కుంటారు. కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి.
 
కన్య:- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ప్రియతముల రాక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. పాత వ్యవహారాలు అనుకూలించగలవు.
 
తుల:- రవాణా రంగాల వారికి ప్రయాణికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవం కుదరగలదు. ముఖ్యుల విషయాలు చర్చకు వచ్చిన వాయిదా వేయండి. ఇతరుల సలహాను పాటించుట వలన సమస్యలు తప్పవు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం:- మార్కెటింగ్ రంగాల వారికి, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సోదరి సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికీ మాటికి అసహనం ఎదుర్కొంటారు. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి.
 
ధనస్సు:- మీ శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు.
 
మకరం:- మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. గృహోపకరణాల కొనుగోలుకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఊహించని రీతిలో ప్రయాణాలు చేస్తారు. కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు కాస్త ఆలస్యమైనా కంగారు పడకండి.
 
కుంభం:- దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. బంధువుల ఆకస్మిక రాక వల్ల స్త్రీలకు పని భారం అధికమవుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు.
 
మీనం:- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదుటపడతారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలున్నాయి. పెద్దల ఆరోగ్యముల సంతృప్తి కానవస్తుంది. బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments