Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుధవారం రాశిఫలాలు - నవదుర్గాదేవిని తెల్లని పూలతో ఆరాధించినా...

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 29 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం:- సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు.
 
వృషభం:- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల వేధింపులు, సహోద్యోగులతో చికాకులు తప్పవు. ఏ విషయంలోనూ హమీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
మిథునం:- పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. సంప్రదింపులు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కర్కాటకం:- స్త్రీలకు బంధువర్గాల ఆదరణ, సహాయ సహకారాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యార్ధినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఆకస్మిక ప్రయాణం ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం:- స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పెద్ద ఖర్చు తగిలే అస్కారం ఉంది. ధనవ్యయంలో మితం పాటించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారు. ప్రతి వ్యవహారం మీకు అనుకూలంగానే ఉంటుంది.
 
కన్య:- రుణ వాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, నష్టాలను అధిగమిస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. మంచి చేసినా విమర్శలు తప్పవు. దైవాదికార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల:- ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. పరిచయంలేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ నిరుత్సాహ పరుస్తుంది. మీ కృషికి కుటుంబీకులు, సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది.
 
వృశ్చికం:- దైవ, సేవా, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలందిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, దూరప్రయాణాల్లో మెళకువ వహించండి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది. దూరపు బంధువులతో ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఆస్తి, కోర్టు, భూ వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.
 
ధనస్సు:- పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. విద్యార్థులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు తాత, మౌఖిక పరీక్షలు నిరుత్సాహపరుస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది.
 
మకరం:- సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, వస్త్ర వ్యాపారులకు కలిసిరాగలదు. ఏ యత్నం కలిసిరాక పోవటంతో నిరుత్సాహం చెందుతారు. దైవదర్శనాలు చేసుకోగలుగుతారు. రావలసిన ధనం అందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకోగలవు. ఆరోగ్య విషయంలో సంతృప్తి కానరాదు.
 
కుంభం:- కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఎదుటివారి తీరును గమనించి ముందుకు సాగండి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. బంధు మిత్రులరాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది.
 
మీనం:- ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయటం క్షేమదాయకం. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ పరిస్థితుల క్రమేణా మెరుగుపడతాయి. కోర్టు వ్యవహారాలలో సంతృప్తి కానరాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించిన శుభం...