రూ.కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన తితిదే... కారణం? (video)

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (11:22 IST)
దేశంలో ప్రఖ్యాత దేవస్థానంగా గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వందలాది కోట్ల రూపాయల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. దీనికి కారణం కరోనా వైరస్ కారణంగా భక్తుల దర్శనం నిలిపివేయడమే. ఈ ఒక్క కారణంతో తితిదే ఏకంగా రూ.300 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీనికితోడు.. తిరుమల గిరులపైకి కరోనా ప్రవేశించకుండా ఉండేందుకు వీలుగా తితిదే ఘాట్ రోడ్లను మూసివేసింది. అలాగే, భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసింది. దీంతో కొండపై భక్తుల సందడిలేక బోసిబోయి కనిపిస్తున్నాయి. ఘాట్ రోడ్లపై వన్యప్రాణులు, క్రూర మృగాలు యధేచ్చగా సంచరిస్తున్నాయి. 
 
అయితే, ఈ లాక్‌డౌన్ అన్ని రంగాలపై ఏ విధంగా ప్రభావం చూపిందో అలాగే తితిదే ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా గత నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ.300 కోట్ల ఆదాయాన్ని శ్రీవారు కోల్పోయారు. ఇది 2020-21 సంవత్సర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్చ చర్యల్లో భాగంగా, మార్చి 19వ తేదీ నుంచి టీటీడీ ఘాట్‌ రోడ్లను మూసివేయడంతో పాటు 20వ తేదీ మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసిన విషయం తెల్సిందే. ప్రధానంగా వివిధ ఆర్జితసేవా టిక్కెట్లు, ప్రసాదాలు, వసతి గదుల కేటాయింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని టీటీడీ కోల్పోయింది.
 
అలాగే తలనీలాల ద్వారా వచ్చే ఆదాయం, దుకాణాలు, హోటళ్ల ద్వారా వచ్చే బాడుగల రాబడులు కూడా ఆగిపోయాయి. టీటీడీ ఆదాయ వనరుల్లో శ్రీవారి హుండీ ఆదాయం ప్రధానమైంది. నెలకుపైగా దర్శనాలు నిలిపివేయడంతో దాదాపు రూ.100కోట్ల పైగా ఆదాయం కోల్పోయింది. ఇలా మొత్తంగా దాదాపు రూ.300కోట్లకు పైగా టీటీడీ ఆదాయానికి గండిపడినట్లైంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments