80 ఏళ్ల వయస్సైతేనేం.. తిరుమల కొండ మెట్లెక్కి.. శ్రీవారిని దర్శించుకున్న వృద్ధురాలు (video)

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (12:20 IST)
Woman
తిరుమల శ్రీవారు భక్తుల కొంగుబంగారం. కోరిన కోర్కెలు తీర్చే ప్రత్యక్ష దైవం. అలాంటి శ్రీ వేంకటేశ్వరుడికి మొక్కుకుని మొక్కులు చెల్లించుకునే వారు కోకొల్లలు. ఇంకా శ్రీవారిని కాలిబాటన నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకునే వారు చాలామంది.  అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా నిత్యం ఎంతో మంది భక్తులు కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. 
 
మనసులో శ్రీవారిని స్మరించుకుంటూ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ కొండపైకి చేరుకుంటారు. అయితే ఈ కొండమార్గంలో నడుచుకుంటూ వెళ్లేందుకు మధ్య వయస్కులే చాలా శ్రమపడుతూ వుంటారు. అలాంటిది 80 ఏళ్ల వృద్ధురాలు కర్రపట్టుకుని సునాయాసంగా శ్రీవారి మెట్లు ఎక్కుతూ వెంకన్నను దర్శించుకుంటారు. 
 
అయితే ఎనిమిది పదుల వయస్సులోనూ శ్రీవారిపై వున్న నమ్మకంతో మెట్లు ఎక్కుకుంటూ ఓ వృద్ధురాలు కాలిబాటన మెట్లు ఎక్కుతూ వెంకయ్యను దర్శించుకున్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆమె చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ వయస్సులో ఆమె భక్తికి జోహార్లు అంటూ ప్రశంసిస్తున్నారు. 
 
ఇదే తరహాలో ఒకే వ్యక్తి 2600 సార్లు తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతికి చెందిన రమణమూర్తి అనే వ్యక్తి తాను 2600 సార్లు తిరుమల కొండెక్కినట్లు చెప్పిన వీడియో రెండు రోజుల క్రితం వైరల్ అయ్యింది.  2024 సెప్టెంబర్ 21 నాటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇక ఆ వీడియోలో తన పేరు వెంకట రమణమూర్తి అని.. తనది తిరుపతి అని, తనకు ఇప్పుడు 70 ఏళ్లు వయసు అని ఆ పెద్దాయన చెప్పారు. 14 ఏళ్ల నుంచి 2600 సార్లు తిరుమల కొండెక్కి దిగినట్లు వివరించారు. ఇప్పటి వరకూ 3350 దర్శనాలు అయ్యాయని తెలిపారు. ఒక్కోరోజు రెండు సార్లు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నానని చెప్పారు. అంగప్రదక్షిణలోనూ పాల్గొంటానని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం

Palle Panduga 2.0: గ్రామాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం కీలకం.. పవన్ కల్యాణ్

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

తర్వాతి కథనం
Show comments