Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టంబరు నుంచి 30 వేల మందికి దర్శనాలు - బ్రహ్మోత్సవాల కోసమేనా?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (17:48 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం కూడా కఠినతరమైంది. కోవిడ్ నిబంధనలతో పాటు కోవిడ్ ఆంక్షల కారణంగా దర్శనాల అమలులో తితిదే అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం పరిమిత సంఖ్యలోనే పంపిస్తున్నారు. 
 
అయితే, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దర్శనాల సంఖ్యను పెంచే యోచనలో తితిదే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 9 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి తితిదే అనుమతిస్తున్నది. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని భావిస్తోంది. 
 
ఇందులోభాగంగా, సెప్టెంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. కరోనా కారణంగా జులై 16 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన విషయం విదితమే. అయితే.. సెప్టెంబర్ నుంచి 20 వేల నుంచి 30 వేల మందిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ విషయంపై టీటీడీ పాలకమండలిలో తుది నిర్ణయం తీసుకుంటారు. 
 
సెప్టెంబరులో ఎన్నో విశేషాలు... 
ఇదిలావుంటే, సెప్టెంబరు మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 1న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, 17న మహాలయ అమావాస్య ఉంది. 18వ తేదీన‌ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జ‌రుగ‌నుంది. ఆ త‌ర్వాతి రోజు అంటే సెప్టెంబరు 19న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి. 
 
23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జా‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్త‌వుతాయి. ఇక‌ సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం జ‌రుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

20-11-2024 బుధవారం ఫలితాలు - గృహం ప్రశాంతంగా ఉంటుంది...

తర్వాతి కథనం
Show comments