Webdunia - Bharat's app for daily news and videos

Install App

108 అడుగుల ల‌క్ష్మీన‌ర‌సింహ‌! ప్ర‌పంచంలోనే పెద్దది!!

Webdunia
సోమవారం, 5 జులై 2021 (10:17 IST)
Lord Narasimha
ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది అయిన 108 అడుగుల ఎత్త‌యిన ల‌క్ష్మీ న‌ర‌సింహ విగ్ర‌హాన్ని కృష్ణా జిల్లాలో ప్ర‌తిష్ఠించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రం దీనికి వేదిక అయింది. అనిత‌ర సాధ్యంగా 108 అడుగుల ఎత్తయిన లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠాప‌న  అంగ రంగ వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితులు మంత్రోఛార‌ణ‌తో స్వామి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు.
 
ఈ  విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లలిత కామేశ్వరి పీఠం స్వామీజీ శ్రీ ఆదిత్య ఆనంద భారతి స్వామి హాజ‌ర‌య్యారు. దేశం నలుమూలల నుండి విరాళాలతో ఏ ఎస్ ఎం సి సేవా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
అధిక సంఖ్య‌లో భ‌క్తులు ఈ వేడుక చూసేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు. అయితే, కరోనా కారణంగా కమిటీ వారు నియమ నిబంధనలు పాటిస్తూ, భక్తుల రద్దీని  దృష్టిలో ఉంచుకొని తగు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన శిల్పులు ఈ 108 అడుగుల భారీ విగ్ర‌హాన్ని అంత్యంత నైపుణ్యంగా త‌యారు చేశారు. దేశంలోగాని, మ‌రెక్క‌డా గాని ఇంత పెద్ద ల‌క్ష్మీ న‌ర‌సింహ విగ్ర‌హం లేద‌ని వేద పండితులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments