Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో వెలుగుతున్న దీపం గురించి తెలిస్తే షాకే..?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (18:27 IST)
ఇప్పుడు తిరుమల శ్రీవారి సిరిసంపదలతో తులతూగుతోంది. వార్షిక ఆదాయం రూ.3,000 కోట్లకు పెరిగింది. బ్యాంకుల్లో శ్రీవారికి చెందిన 7 టన్నుల బంగారం గుట్టగా పోగయింది. రూ.15 వేల కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఎక్కడెక్కడో భూములు, మిద్దెలు మేడలు శ్రీవారి సొంతం. అయితే… ఒకనాడు శ్రీవారి సంపదంతా ఆవుమందలే. ఆ మందలే స్వామివారి ఆలయంలో దీపారాధనకు ఆధారమయ్యాయి.
 
శ్రీవారి ఆలయంలో ఒకప్పుడు ఆలయంలో దీపం వెలిగించడానికే ఇబ్బందిపడ్డారు. దీపం వెలిగించడం కోసమే విరాళాలు స్వీకరించారు. ఇలా స్వీకరించిన విరాళాలలో ఆవుల మందలే ప్రధానంగా వుండేవి. ఆలయంలో ఒక నేతిదీపం వెలిగించాలంటే…. 32 ఆవులు, ఒక ఆబోతు స్వామివారికి కట్నంగా స్వీకరించేవారట. ధనవంతులైతే 40 కొలంజుల బంగారం ఇచ్చేవారట. ఇది ఒక పద్ధతిగా ఆనాడు నిర్దేశించుకున్నారు.
 
శ్రీవారి ఆలయంలో క్రీ.శ. 830లో అప్పటి రాజులు ‘నందవిళక్కు’ అంటే ‘వెలుగుతున్న దీపం’ అనే పేరుతో నిత్యం నేతిదీపం వెలిగించే పద్ధతికి శ్రీకారం చుట్టారట. శాసనాల్లో చాలాచోట్ల వెలుగుతున్న దీపం ప్రస్తావన వుంది. దీపాలను వెలిగించడానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చిందీ శాసనాల్లో రాశారు. దీపాలను వెలగించడానికి విరాళంగా వచ్చిన ఆవులను పోషించడానికి అవసరమైన గడ్డి పెంపకం కోసం భూములు విరాళంగా ఇచ్చిన రాజులున్నారు. బంగారాన్ని శ్రీవారి భాండాగారానికి జమ చేసిన విధానమూ ఆనాడు అమల్లో వుంది.
 
క్రీ.శ.905 నుంచి క్రీ.శ.953 దాకా ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి పరాంతక చోళుడైన పరాకేశసరి… శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండు నేతి దీపాలు వెలిగించడం కోసం ఒక్కో దీపానికి 40 కొలంజుల బంగారం దానం చేశారు. తెలుగు పల్లవ రాజులలో అత్యంత ముఖ్యుడైన విజయగండ గోపాలుని పట్టపురాణి దేవరసియార్‌ తిరుమల శ్రీవారి సన్నిధిలో 3 దీపాలు వెలిగించడానికి 32 ఆవులు, ఒక ఆబోతు, బంగారం దానం చేశారు. యాదవ రాజులలో అత్యంత పరాక్రమవంతునిగా పేరుగాంచిన వీరనరసింగదేవ యాదవరాయలు గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యం దీపారాధన కోసం 32 గోవులను, ఒక ఎద్దును దానం చేశారు. అలాగే తిరుమల ఆలయానికీ 32 ఆవులు, ఒక ఆబోతు దానం చేశారు.
 
ఇలా శాసనాల్లో పలుచోట్ల శ్రీవారికి గోదానం చేసిన ఉదంతాలు కనిపిస్తాయి. గోవులను పోషించడం, వాటిద్వారా వచ్చే పాల నుంచి వెన్నను, దాని నుంచి నెయ్యిని సేకరించి… దాంతో దీపాలు వెలిగించడమనేది ఒక పద్ధతిగా సాగింది. అందుకే శ్రీవారి తొలి సందప ఆలమందలే అయ్యాయి. ఈ లెక్కన అప్పట్లో శ్రీవారికి ఎన్ని వేల ఆవులు ఆస్తిగా ఉండేవో అనిపిస్తుంది. ఇప్పటికీ స్వామివారికి ఆవులను కానుకగా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. తిరుమల, తిరుపతిలోని టిటిడి గోశాలలో ఉన్నవి అలా వచ్చిన ఆవులే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments