విభూది ఎందుకు ధరిస్తారు? అందులో ఏముంది?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (21:51 IST)
విబూది అంటే పవిత్ర భస్మం. ఇది ఐశ్వర్యకారకం. పాపాలను నశింపచేస్తుంది. చెట్టు కాలినా చివరికి మిగలేది మాత్రం భస్మమే. అయితే ఏ బూడిద అయినా విబూదేనా అంటే కానే కాదని చెప్పాలి. సాధారణంగా గోమయ భస్మాన్నే విబూదిగా చెప్తారు. ఆవు పేడను సేకరించి పిడకలు లేదా ఉండలుగా చేసి వాటిని ఆరబెడతారు. ఆ పేడలో దాదాపు 16 రకాల ఔషధ గుణాలున్నాయి.
 
ఈ పిడకల్ని ధాన్యపు పొట్టులో కానీ గడ్డితో కానీ అరలు అరలుగా పేర్చి మాసశివరాత్రి రోజున వేదమంత్రోఛ్ఛారణ మధ్య కాల్చుతారు. ఈ పద్ధతిని విరజహోమం అంటారు. కాలాక వాటిని తడిపి ఆరబెడతారు. దీన్ని దిమ్మలుగా చేసి విబూదిపండ్లుగా భక్తులకు అందజేస్తారు. విబూదిని ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకాల్లోని ఆలయాల్లో ఉపయోగిస్తుంటారు. విబూదిని గుడుల్లో అనుసంధానమై ఉండే గోశాలల్లో తయారుచేస్తుంటారు.
 
అలాగే రకరకాల ఔషధ మెుక్కల్ని ఉపయోగించే హోమాల నుండి కూడా విబూదిని తయారుచేస్తారు. హోమ భస్మంలో ఆవుపేడతో పాటు 108
 
మూలికలు, సుగంధద్రవ్యాలు, ఆవు నెయ్యి ఉంటాయి. ఇవి అహాన్ని, కోరికలను అగ్నికి ఆహుతి చేశామన్న దానికి గుర్తుగా సాధువులు ధరిస్తుంటారు. విబూదిని ధరిస్తే అందులోని ఔషధ గుణాలు శరీరానికి చాలా మంచిది.
 
పద్ధతి ప్రకారం ఉంగరపు వేలు, బొటనవేళ్లతో విబూదిని తీసుకుని కనుబొమల మధ్య, గొంతుమీద, ఛాతిమీద ఎక్కువగా ధరిస్తారు. విబూది ధారణతో ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు అనారోగ్యాల నుండి శరీరాన్ని కాపాటుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎరుపు జరి, చిలుకపచ్చ రంగు.. మహిళలకు ఉచిత చీరల పంపిణీ

Heat Wave Forecast: ఏపీలో వేడిగాలులు.. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు..

నాటో సహా మిత్ర దేశాలకు ఏమీ అర్థం కాదు : డోనాల్ట్ ట్రంప్ అసహనం

సెలవుల్లో గ్రామానికి వెళ్లిన విద్యార్థినిలు... సరదా కోసం సెల్ఫీకి యత్నించి చనిపోయారు..

11 యేళ్ల బాలికపై అత్యాచారం .. ఎవరికీ చెప్పొద్దంటూ రూ.150 చేతిలో పెట్టాడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి తలనొప్పి.. రూ.400 కోట్లకు పైగా పాత నోట్లు.. హుండీ ఆదాయంతో ఆర్థిక నష్టం

వైశాఖ కృష్ణ పక్ష పంచమి: ఉజ్జయిన్‌ మహాకాలేశ్వర ఆలయంలో భస్మ హారతి

07-04-2026 మంగళవారం ఫలితాలు : రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది

06-04-2016 సోమవారం ఫలితాలు - త్వరలో మీ కృషి చేస్తుంది

05-04-26 ఆదివారం ఫలితాలు - అవసరాలకు ధనం అందుతుంది..

తర్వాతి కథనం
Show comments