Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సమయంలో తులసి చెట్టుపై మహిళల నీడ పడితే ఇక అంతే...

మన భారతీయ సనాతన జీవన విధానంలో తులసి ఒక ముఖ్యభాగం అయిపోయింది. హిందువులు తులసిని పూజల కోసమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోగానే సరిపోదు... తప్పనిసరిగా కొన్ని నియమనిబంధనలను పాటించాలి. తులసి చెట్టు ఆకులను ఎప

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (20:41 IST)
మన భారతీయ సనాతన జీవన విధానంలో తులసి ఒక ముఖ్యభాగం అయిపోయింది. హిందువులు తులసిని పూజల కోసమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోగానే సరిపోదు... తప్పనిసరిగా కొన్ని నియమనిబంధనలను పాటించాలి. తులసి చెట్టు ఆకులను ఎప్పుడుపడితే అప్పుడు తుంచకూడదు... అలాగే తాకకూడదు.
 
ముఖ్యంగా మహిళలు రుతుస్రావం అవుతున్న సమయంలో తులసి చెట్టును అస్సలు తాకకూడదు. వారి నీడ కూడా పడకూడదు. రాత్రి సమయాల్లో తులసి ఆకులను తుంచకూడదు. అలాగే గ్రహణ సమయాల్లో తులసి ఆకులను తుంచితే చాలా అరిష్టం. తులసి చెట్టు వద్ద నిత్యం దీపం వెలిగించి పూజ చేయాలి. ఆకులను తుంచేటప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను తల్లి.. నా ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడు అని తులసి ఆకులను అప్పుడు తుంచాలి. 
 
తులసి ఆకులను నోటిలో వేసుకొని నమలకూడదు. ఇందులోని ఆమ్లం దంతాలకు హాని చేస్తుంది. నీళ్లలోను, టీలో కలిపి తులసి ఆకుని తీసుకోవాలి. ఎండిపోయిన ఆకులు రాలితే వాటిని చీపుర్లతో ఊడ్చకూడదు. తులసి మొక్క ఎండిపోతే పక్కనే ఒక గుంత తీసి పూడ్చిపెట్టాలి. పూడ్చి పెట్టకుంటే నీటి గుంటలో అయినా వేయాలి. ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉంటే అస్సలు మంచిది కాదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments