Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూజించే తులసిని ఇంట్లో ఏ దిశలో వుంచాలో తెలుసా?

తులసిని దేవతగా ఇంట్లో వుంచి పూజలు చేస్తుంటారు. హిందువులు దేవతగా పూజించే తులసి కోట ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే కొత్త ఇంటిలో దీనిని ఎక్కడ పెట్టాలి. ఏ విధంగా, ఏ దిశలో ఏ వైపు నిర్మించుకోవాలన్న విషయాలను తెలుసుకోవాలి. తులసి కోటను నిర్మించాలనుకునేవారు తుల

పూజించే తులసిని ఇంట్లో ఏ దిశలో వుంచాలో తెలుసా?
, శుక్రవారం, 27 అక్టోబరు 2017 (21:36 IST)
తులసిని దేవతగా ఇంట్లో వుంచి పూజలు చేస్తుంటారు. హిందువులు దేవతగా పూజించే తులసి కోట ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే కొత్త ఇంటిలో దీనిని ఎక్కడ పెట్టాలి. ఏ విధంగా, ఏ దిశలో ఏ వైపు నిర్మించుకోవాలన్న విషయాలను తెలుసుకోవాలి. తులసి కోటను నిర్మించాలనుకునేవారు తులసి కోట చుట్టూ తిరిగే విధంగా తప్పకుండా స్థలం ఉంచుకోవాలి. అలాగని వీటిని ప్రహరీ గోడలకు ఆనించి నిర్మించకూడదు. ఉత్తర వాయవ్యంలో లేదా తూర్పు వాయవ్యంలో తులసి కోటను అమర్చాలనుకుంటే నేల ఎత్తుకంటే కాస్త తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. 
 
పశ్చిమ దిశలో అంటే నైరుతి లేదా వాయవ్య దిశలలో తులసి కోటను నిర్మించాలంటే నేల ఎత్తుకంటే కాస్త ఎక్కువగా లేదా కాస్త తక్కువగా ఉండేటట్టు ప్లాన్ చూసుకోవాలి. అలాగే దక్షిణ దిశలో నిర్మించుకోవాలనుకుంటే నేలకు సమానంగా ఉండకుండా కాస్త ఎత్తుగా లేదంటే పల్లంగా ఏర్పాటు చేసుకోవాలి. 
 
తూర్పు ఈశాన్యం, ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలలో తులసి కోటలను ఉంచకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో బరువు ఎక్కువై చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అయితే పూర్వంలోలా ప్రస్తుత కాలంలో తులసికి కోటలు కట్టడం లేదు. పూల మొక్కలు పెంచే వాటిలోనే పెంచుతున్నారు. అయినప్పటికీ, వీటిని దక్షిణ ఆగ్నేయ, పశ్చిమ వాయవ్య దిశలలో పెట్టుకుంటే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రహ శాంతి.... చంద్రగ్రహ దోష శాంతికి ఏం చేయాలి?