Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలి.. ఉచితంగా భూమి ఇవ్వండి: బీఆర్ నాయుడు

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (09:33 IST)
టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఉచితంగా భూమి ఇవ్వాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశాభివృద్ధిలో టెంపుల్‌ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయంటూ లేఖలో పేర్కొన్నారు. 
 
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను దేశవ్యాప్తంగా నిర్మించాలని బీఆర్ నాయుడు అన్నారు. ప్రపంచ దేశాలు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారని.. వారి సౌకర్యార్థం దేశంలోని పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 
 
ఇటీవల తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్‌పో (ఐటిసిఎక్స్)లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్ర ప్రధాన నగరాల్లో, అన్ని దేశాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ 27,000 దేవాలయాలను నిర్వహిస్తుందని, ఏటా 21 కోట్ల మంది యాత్రికులు వస్తారని, ఇది దేశంలోనే అత్యధికమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భార్యతో ఉరివేసుకున్నట్టుగా సెల్ఫీ దిగిన యువకుడు.. విషాదాంతంగా ముగిసిన ఫ్రాంక్

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

03-03-2025 సోమవారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

నేటి నుంచి పవిత్ర రంజాన్ మాస దీక్షలు ప్రారంభం...

02-03- 2025 ఆదివారం రాశిఫలితాలు - ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

02-03-2025 నుంచి 08-03-2025 వరకు మీ వార రాశిఫలితాలు

Tirumala: వేసవి సెలవులు తిరుమల రద్దీ.. కొండపై కూల్ పెయింట్.. ఆదేశాలు జారీ

తర్వాతి కథనం
Show comments