తిరుమలలో వసంతోత్సవాలు.. కళ్యాణ మండపంలో నిరాడంబరంగా...

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:22 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు ఈ దఫా కేవలం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలోనే జరుగనున్నాయి. 
 
నిజానికి ప్రతియేటా చైత్రశుద్ధ త్రయోదశికి మొదలై పౌర్ణమికి ముగిసేలా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులోభాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్న సమయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి ఆలయంలోని కళ్యాణ మండపంలో అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. 
 
తొలి రెండు రోజులు మలయప్పస్వామి, దేవేరులు మాత్రమే వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజున మూడు యుగాలను గుర్త్తుచేస్తూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామికి ఏకకాలంలో అభిషేకం నిర్వహిస్తారు. దాంతో పవిత్సోత్సవాలు ముగుస్తాయి. 
 
అయితే, ఈ యేడాది కరోనా వైరస్ ప్రభావం కారణంగా వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు నిర్వహించే రథోత్సవాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. దానికి బదులుగా సర్వభూపాల వాహనంలో ఉత్సవర్లను కొలువుదీర్చి మండపంలోనే విశేష సమర్పణ నిర్వహించేలా నిర్ణయించారు. మొత్తంమీద శ్రీవారి సేవలు, ఉత్సవాలన్నీ భక్తులు లేకుండానే కేవలం ఆలయ అధికారులు, వేదపండితుల సమక్షంలోనే జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం

Jagan Visits Cyclone areas: కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాను ప్రాంతాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

తర్వాతి కథనం
Show comments