Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-04-2020 ఆదివారం మీ రాశిఫలాలు - సూర్యడుని పూజించినా...

Advertiesment
05-04-2020 ఆదివారం మీ రాశిఫలాలు - సూర్యడుని పూజించినా...
, ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు సంతానం, పనివారలతో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. 
 
వృషభం : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పెద్దల వేళ తప్పి భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్సాంతి దూరం చేస్తారు. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాల్లో చోటుచేసుకుంటాయి. వస్త్ర వ్యాపారాలు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
మిథునం : ప్రభుత్వ నిరుద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్లు పొందుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. 
 
కర్కాటకం : చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. పాత జ్ఞాపకాలు గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. ఏసీ కూలర్ మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. 
 
సింహం : పాత వస్తుపులకు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. రావలసిన బాకీలు వసూలువుతాయి. వైద్య రంగాల్లో వారికి వృత్తిరీత్యా చికాకులు ఎదుర్కొన్న మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. 
 
కన్య : భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. చేతి వృత్తుల, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ అధికమవుతుంది. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. 
 
తుల : కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికై చేయు యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కారు. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వహిస్తారు. 
 
ధనస్సు : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వ్యవసాయదారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
మకరం : స్త్రీలు ఎటువంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకుపోకుండా చిత్తశుద్ధితో వ్యవహరించడం అన్ని విధేలా శ్రేయస్కరం. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఉద్యోగస్తులు అధికారులకు విలువైన కానుకలు అందించి పరిచాయలు పెంచుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
కుంభం : ఉద్యోగస్తులకు అధికారులకు ఒత్తిడి ఎదురవుతుంది. పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
మీనం : పండ్లు, కొబ్బరి, పూలు, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకుకుల తప్పవు. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త పథకాలు వేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యంగా వుండాలంటే.. ధన్వంతరి పూజ చేయాలట..?