ఆరోగ్యంగా వుండాలంటే.. ధన్వంతరి పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. రోగాలను దూరం చేసుకోవాలంటే.. ధన్వంతరి భగవానుడిని పూజించాలని చెప్తున్నారు. పురాణాల్లో దేవతలు, రాక్షసులు పాల సముద్రంలో చిలికిన సందర్భంగా అమృతం బయటపడింది. ఈ పాల సముద్రం చిలికినపుడు చివరిగా ధన్వంతరి భగవానుడు ఉద్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి.
ఇదే పాల సముద్రం నుంచి వ్యాధులను నివారించే వైద్య మూలికలను కనుగొన్నారు. వ్యాధులను నివారించి.. ఆరోగ్యాన్ని రక్షించే వైద్య మూలికలతో ఉద్భవించిన ధన్వంతరి భగవానుడిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
ధన్వంతరిని త్రయోదశి తిథిలో పూజిస్తే ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. త్రయోదశి రోజున ధన్వంతరిని తలచి ఉపవసించి.. పూజ చేసి.. తగినంత వస్త్రదానం చేయాలి. ఇంకా త్రయోదశి తిథి రోజున యమాష్టక స్తుతి చేయడం ద్వారా ప్రాణాంతక వ్యాధులు నయం అవుతాయి. ఇంకా అకాల మరణాలు, దుర్మరణాలు వుండవు. ధన్వంతరి పూజతో యమదేవుని అనుగ్రహం కూడా చేకూరుతుందని విశ్వాసం.