అలాంటివారికి నరకంలో కూడా చోటులేదు... స్వామి వివేకానంద

స్వామి వివేకానంద చెప్పిన ఎన్నో మాటలు ఆచరించదగినవి. ఆయన చెప్పిన సూక్తులు స్ఫూర్తిదాయకం. కొన్నింటిని చూద్దాం. 1. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అని ఆలోచించవద్దు. దాన్ని ఒక అత్యున్నతమైన ఆరాధనగా చేయండి. ఆ పని చేస్తున్నంత వరకు మీ జీవ

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (19:16 IST)
స్వామి వివేకానంద చెప్పిన ఎన్నో మాటలు ఆచరించదగినవి. ఆయన చెప్పిన సూక్తులు స్ఫూర్తిదాయకం. కొన్నింటిని చూద్దాం. 1. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అని ఆలోచించవద్దు. దాన్ని ఒక అత్యున్నతమైన ఆరాధనగా చేయండి. ఆ పని చేస్తున్నంత వరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించండి.
 
2. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచెయ్యకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మ శక్తిని మరల మరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది.
 
3. ప్రతి బాధ్యతా పవిత్రమైనదే. బాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునికి మనం చేయగలిగే అత్యుత్తమమైన అర్చన.
 
4. నిరంతర వికాసమే జీవనం. సంకోచమే మృత్యువు. తన వ్యక్తిగత సుఖాలనే చూసుకుంటూ, సోమరితనంతో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా స్థానం లేదు.
 
5. నిరంతరం శ్రద్దాభావంతో ఏమి చేసినా, నీకది మేలే. చాలా చిన్న పనినైనా, సవ్యంగా చేస్తే మహాద్బుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తాను చేయగల ఎంత చిన్న పనినైనా శ్రద్దతో నిర్వహించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments