ఒళ్ళంతా అదోలాంటి కాంతి, ఆ కన్యను చూడగానే అతడికి మతిపోయింది

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (21:27 IST)
కామం కాలాతీతమైనది. కానీ వేళకాని వేళ కామానికి దాసులై నాశనమైన వారి కథలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. దాండక్యుడు ఒక రాజు. అతడిది భోజ వంశం. అతికాముకుడు. అందమైన స్త్రీ తారసపడితే ఆమెను అనుభవించే వరకూ స్థిమితంగా ఉండలేని తత్త్వం దాండ్యకుడిది. ఒక రోజు వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అక్కడో ఆశ్రమం కనిపించింది. అది భార్గవ మహరిషిది. అప్పటికే బాగా అలసి ఉన్న దాండక్యుడు సేదతీరడం కోసం ఆశ్రమంలోకి అడుగు పెట్టాడు. లోపల మహర్షి లేడు. ఆయన కూతురు ఉంది. చిన్న వయసు. చూడచక్కగా ఉంది.
 
పెళ్ళీడుకు అప్పుడప్పుడే ప్రవేశిస్తున్నట్లుంది. ఒళ్ళంతా అదోలాంటి కాంతి, ఆ ముని కన్యను చూడగానే దాండక్యుడికి మతిపోయింది. కామేచ్ఛ ఎగచిమ్మిది. ఉన్నపళాన ఆమెను బలవంతంగా ఎత్తి పట్టుకుని తన రథంపైన ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. దర్పలు, సమిధుల కోసం వెళ్ళిన భార్గవ మహర్షి కొంతసేపటికి ఆశ్రమానికి చేరుకున్నాడు. కుమార్తె కనిపించలేదు. పరిసరాలు వెదికాడు. ప్రయోజనం లేదు. చివరికి దివ్యదృష్టి సారించాడు. విషయం అర్థమయింది. ఆగ్రహోదగ్రుడయ్యాడు. బంధుమిత్ర సపరివార సమేతంగా నశించిపొమ్మని దాండక్యుడిని శపించాడు. అలా దాండక్యుడు అంతరించిపోయిన ప్రదేశమే ఇప్పటి దండకారణ్యం.
 
ఇక అహల్య, ఇంద్రుల ఎపిసోడ్‌ అందరికీ తెలిసిందే. అహల్య.. గౌతమ మహర్షి భార్య. పురుషులను దాసోహం చేయించే అందం ఆవిడది. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సైతం ఆ అందం మాయలో పడ్డాడు. ఆమెను కామించాడు. మహర్షి లేని సమయం కనిపెట్టి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను అనుభవించాడు. ఆ క్రీడ అలా సాగుతుండగానే గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. స్త్రీ తనను సంతృప్తి పెట్టిన పురుషుడికి ప్రాణం ఇస్తుంది. ప్రాణాపాయం నుండి కాపాడుతుంది. అహల్య అలాగే చేసింది. భర్త కంటపడకుండా ఇంద్రుణ్ణి తన గర్భంలో దాచేసింది. అదే సమయంలో గౌతముడికి ఎక్కడి నుంచో పిలుపు వచ్చింది. భార్యను కూడా వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు.
 
గౌతముడిని ఆహ్వానించిన వ్యక్తి సామాన్యుడు కాడు. అహల్యను చూడగానే దివ్యదృష్టితో అసలు విషయం తెలుసుకున్నాడు. లెక్క ప్రకారం మూడు ఆసనాలు సిద్ధం చేశాడు. “రెండు చాలు కదా. మూడోది ఎవరికి” అని గౌతముడికి సందేహం కలిగి యోగ దృష్టితో చూశాడు. అహల్య రహస్యం బైటపడింది.
 
“ ఓహో! ఈ పెద్ద మనిషి ఇంద్రుడి కోసం మూడో ఆసనం వేశాడా” అని అనుకున్నాడు. ఇంద్రునిపై పట్టరాని కోపం వచ్చింది. సహస్ర భగుడవుకమ్ము అని శపించాడు. కామాంధుడై పర పురుషుని భార్యను రమించినందుకు ఒళ్ళంతా స్త్రీ జననాంగాలై ఇంద్రుడు దురవస్థ పొందాడు. పురాణాల్లో ఇలాంటి కేసులు లెక్కలేనన్ని. సీతను చెరబట్టిన రావణాసురుడు, ద్రౌపదిని బలాత్కరించిన కీచకుడు సర్వనాశనమైపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

20-10-2025 సోమవారం దినఫలాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

19-10-2025 ఆదివారం దినఫలాలు - దుబారా ఖర్చులు విపరీతం...

19-10-2015 నుంచి 25-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments