తెలుగు చిత్రపరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టి వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అలాగే, తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నటించే గోల్డెన్ ఛాన్స్‌ను దక్కించుకున్నారు. తాజాగా నితిన్ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ వరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం సినిమా రూపొందుతోంది. శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. మరో కథానాయికగా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే తెలుగులో నిధి అగర్వాల్ జోరు పెరగనున్నట్టే అనిపిస్తోంది.
అటు కోలీవుడ్‌లోనూ ఈమె వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకునిపోతోంది. శింబు హీరోగా నటించిన 'ఈశ్వరన్' చిత్రం ద్వారా నిధి అగర్వాల్ తమిళ వెండితెరకు పరిచయమయ్యారు. ఇది ఈ యేడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.