Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పద్మావతి'ని ఘాట్‌ రోడ్డులో నడిపించారు... చిరుత వచ్చి దాడిచేసి వుంటే..?

తిరుమలలో శ్రీవారి సేవలో తరించాల్సిన గజరాజులను అడ్డుపెట్టుకుని, ఆశీర్వాదాల పేరుతో రోజూ వేల రూపాయలు గడిస్తున్న మావటీలు చేసిన తప్పుకు ఆ మావటీలతో పాటు గజరాజు (పద్మావతి) ఊడా శ్రీవారి సేవకు దూరం కావాల్సి వచ

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (11:57 IST)
తిరుమలలో శ్రీవారి సేవలో తరించాల్సిన గజరాజులను అడ్డుపెట్టుకుని, ఆశీర్వాదాల పేరుతో రోజూ వేల రూపాయలు గడిస్తున్న మావటీలు చేసిన తప్పుకు ఆ మావటీలతో పాటు గజరాజు (పద్మావతి) ఊడా శ్రీవారి సేవకు దూరం కావాల్సి వచ్చింది. ప్రతి యేటా ఏనుగులను మార్పు చేయాల్సిన సంప్రదాయాన్ని పక్కన పెట్టి గత కొన్నేళ్ళుగా పద్మావతి అనే ఏనుగును తిరుమలలోనే కొనసాగించారు. ఏనుగులు మారితే మావటీలు మారిపోతారు. మావటీలను కొనసాగించడానికి పద్మావతిని కొండదించలేదన్న విమర్శలు వినిపించాయి. ఈ ఏనుగును అడ్డం పెట్టుకుని రోజు వేల రూపాయలు భక్తుల నుంచి వసూలు చేస్తున్నారన్న విమర్శలు రావడంతో తిరుమలలోనే ఉన్న పద్మావతిని కిందకు తరలించారని నిర్ణయించారు. ఈ సందర్భంలోనే హైడ్రామా చోటుచేసుకుంది.. ఇంతకీ ఏమైంది..
 
కొండంత ఏనుగైనా మావటీలు ఏది చెబితే అది చేస్తాయి. కనుసైగతో మావటి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తాయి. కూర్చోమంటే కూర్చుంటాయి. నిలబడమంటే నిలబడతాయి. ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తాయి. కదలమంటే కదులుతాయి. అయితే తిరుమల నుంచి కిందకు తరలించేటప్పుడు మాత్రం పద్మావతి మావటి మాట వినలేదట. లారీ ఎక్కిండానికి ఎంత ప్రయత్నించినా అది ఎక్కలేదట. దీంతో విధిలేకుండా ఘాట్‌ రోడ్డులో నడిపించుకుంటూ తిరుపతిలోని గోశాలకు తరలించారు. ఈ పరిస్థితిని కొందరు హృద్యంగా వర్ణించే ప్రయత్నం చేశారు. 
 
వయసు మీరిన ఆ గజం శ్రీవారిని వీడి వెళ్ళలేక లారీ ఎక్కడానికి ఆ గజరాజు మొరాయించిందని చెప్పారు. విధిలేక మావటీలు, గజరాజును ఘాట్‌రోడ్డులో నడిపించి కిందకు దించారని చెప్పారు. గజరాజుతో పాటు మావటీలకు సానుబూతి సంపాందించిపెట్టేందుకు ప్రయత్నిస్తుంచారు. అయితే ఏనుగు లారీ ఎక్కకపోవడం వెనుక ఉన్న రహస్యం తెలుసుకులేకపోయారు.
 
పద్మావతి స్థానంలో తిరుపతి నుంచి తిరుమలకు తీసుకొచ్చిన ఏనుగు లారీలోనే వచ్చింది. అది లారీని సంతోషంగానే ఎక్కింది. ఏనుగులను ఎప్పుడు తిరుమలకు తీసుకువచ్చినా, తిరుమల నుంచి తీసుకెళ్ళినా లారీలోనే. అలాంటిది పద్మావతి మాత్రం లారీ ఎందుకు ఎక్కలేదని అంతు చిక్కని ప్రశ్న. అసలు లారీ ఎక్కాలన్న సంకేతాలను ఆ ఏనుగుకు ఇచ్చారా? కనుసైగతో దానికి మరోమాట చెప్పారా? ఏనుగు లారీ ఎక్కడం లేదని చెబితే.. దాన్ని అక్కడే ఉంచేస్తారని అనుకున్నారా..? ఏనుగు కొండ దిగకుంటే తాము దిగాల్సిన అవసరం లేదని భావించారా.? 
 
లారీ ఎక్కి కొండ దిగడానికి మొరాయించిన గజరాజం కాలినడకన మాత్రం ఎలా దిగేసింది? ఏమో శ్రీమన్నారాయణుడికే ఎరుక. ఏనుగు ఎప్పుడు మావటి మాటను మీరదని గోశాల ఉద్యోగులే చెబుతున్నారు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. అంతదూరం అదీ ఘాట్‌రోడ్డులో కిందదాకా ఏనుగును కాలినడకన దించడం మాత్రం దాని పట్ల చేసిన అపచారంగానే చెప్పాలి. మార్గమధ్యంలో ఏ చిరుతపులో వచ్చి ఏనుగుపై దాడి ఏసి ఉంటే పరిస్థితి ఏమిటి? అప్పుడు ఆ పాపం ఎవరిది?
 
ఏమైనా ఏనుగుతో జరుగుతున్న దందాకు అడ్డుకట్ట వేయడానికి తితిదే ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయం. పద్మావతి స్థానంలోకి లక్ష్మీ (మరో గజరాజు) వచ్చింది. ఈ మారర్పులను అందరు స్వాగతిస్తున్నారు. తిరుమల, తిరుపతి గోశాలల్లో జరుగుతున్న ప్రక్షాళనలో భాగంగా మరిన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments