Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం.. నేడు తొలి ఏకాదశి... వ్రత విశేషం... ఏం చేయాలి?

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని "శయన ఏకాదశి"

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (11:48 IST)
ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. 
 
ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
 
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే  సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.
 
వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు 1.దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. 2. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్యమాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 5. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 6. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 7.అన్నదానం చేయడం చాలా మంచిది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

Ahmedabad: అక్రమ బంగ్లాదేశ్ నివాసితులపై కొరడా: అదుపులోకి వెయ్యి మంది (Video)

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

తర్వాతి కథనం
Show comments