Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో డబ్బు ఎల్లవేళలా నిలిచివుండాలంటే... ఈ కింది విధంగా నడుచుకోండి!

డ‌బ్బు… అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్ర‌స్తుత స‌మాజంలో డ‌బ్బుతో సాధ్యం కానిదేదీలేదు. డబ్బులేకుండా ఏ పని జరుగదు. కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌డంలో అంద‌రిక‌న్నా ముందువ‌రుస‌లో దూసుకుపోతుంటారు. వారు ప‌ట్టింద‌ల

Webdunia
గురువారం, 14 జులై 2016 (14:39 IST)
డ‌బ్బు… అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్ర‌స్తుత స‌మాజంలో డ‌బ్బుతో సాధ్యం కానిదేదీలేదు. డబ్బులేకుండా ఏ పని జరుగదు. కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌డంలో అంద‌రిక‌న్నా ముందువ‌రుస‌లో దూసుకుపోతుంటారు. వారు ప‌ట్టింద‌ల్లా స్వర్ణమయంగా ఉంటుంది. కానీ కొంద‌రు మాత్రం ఎంత సంపాదించినా చేతిలో అస్సలు నిలవదు. అలాకాకుండా చేతినిండా సంపాదించిన డబ్బు ఎప్పుడు నిలిచి ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటిస్తే చాలు. అవేంటో ఇప్పుడూ చూద్దాం..
 
సిరుల ల‌క్ష్మీ... లక్ష్మీ దేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక  ఇబ్బందులు పూర్తిగా తొల‌గిపోతాయి. ధ‌నం చేతికందుతుంది. ల‌క్ష్మీ దేవి ఫొటోను ద‌గ్గ‌ర పెట్టుకున్నా, విష్ణువు పాదాల‌ను ముట్టుకున్నా ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి.
 
రావి చెట్టు ఆకును శ‌నివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా క‌డిగి, ఆ ఆకుపై హ్రీ అని రాసి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోయి శుభం కలుగుతుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్ల‌ని వైట్ స్టోన్‌ను ద‌గ్గ‌ర ఉంచుకుంటే అది పాజిటివ్ శ‌క్తిని ఇస్తుంద‌ట‌. అలాంటి వారికి ప్ర‌శాంతత కూడా క‌లుగుతుంద‌ట‌.
 
ఎల్లో కౌరీస్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన గ‌వ్వ‌ల‌ను ఏడింటిని తీసుకుని జేబులో పెట్టుకోవాల‌ట‌. దీంతో దరిద్రం మన దరిదాపుల్లోకి కూడా చేరదట.తామ‌ర‌పూవు విత్త‌నాల‌ను జేబులో పెట్టుకుంటే ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌ట‌. శ్రీ‌యంత్రాన్ని ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర ఉంచుకున్నా అంతా మంచే జ‌రుగుతుంది. అలాంటి వారికి డ‌బ్బు ప‌రంగా ఉన్న అన్ని స‌మ‌స్య‌లు తొలగిపోతాయి.
 
ప్రతీ శుక్ర‌వారం కొబ్బ‌రికాయ‌తో ల‌క్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బ‌రికాయ‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. ఇలా చేసినా ఆర్థిక స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments