కార్తీక మాసంలో తులసీదళములు, జాజిపూలతో..?

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (09:01 IST)
జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి. కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
కార్తీక మాసంలో దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యం సిద్ధిస్తుంది.
 
సూర్యాస్తమయం అయిన వెంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి.
 
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించాలి. ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ, జిల్లేడు పువ్వులతోనూ పూజించవలెను. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.
 
అలాగే కార్తీక మాసంలో ధాత్రి పూజ చేయడం మరవకూడదు. ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీ దేవిని,విష్ణువును పూజించి ఫలాలను నివేదించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
శివాలయంలోగాని, ఇంట్లోనైనా సరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం పొందవచ్చు. ఎవరైనా సరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments