డిసెంబర్ 13న పోలి పాడ్యమి.. బియ్యపు పిండితో దీపాలను..?

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (10:38 IST)
డిసెంబర్ 12 కార్తీక అమావాస్య వస్తోంది. డిసెంబర్ 13ని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజున కార్తీకమాసం ముగిసి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో నియమం పాటించేవారు... కార్తీక అమావాస్య మర్నాడు.. మార్గశిర మాసం మొదటిరోజు పాడ్యమి రోజున దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీకమాసం పూర్తవుతుంది.
 
కార్తీకమాసం చివరిరోజును పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు. హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి.. నదులలో వదులుతారు.
 
భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతః కాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు.
 
ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలిస్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు హిందువులంటే లెక్కలేదు.. ఆ మాటలు వింటుంటే.. శ్రీనివాసానంద సరస్వతి

మంగళగిరిలో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ.. పవన్, బాబు, అనిత ఫోటోలు వైరల్

NRI: చెన్నై హోటల్ బిల్లు చూసి షాకైన ఎన్నారై.. కారణం ఏంటో తెలుసా? (video)

Jagan: విమానంలో సీరియస్‌గా కూర్చుని వర్క్ చేస్తోన్న జగన్ - ఫోటో వైరల్

Narendra Modi: వీధికుక్కల బెడదను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-12-2025 సోమవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

14-12-2025 నుంచి 20-12-2025 వరకు మీ వార రాశిఫలాలు

14-12-2025 ఆదివారం ఫలితాలు - పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు...

13-12-2025 శనివారం ఫలితాలు - సర్వత్రా అనుకూలం.. కష్టం ఫలిస్తుంది...

డిసెంబర్ 13, 2025, శనివారం, కృష్ణపక్ష నవమి: పది రూపాయలు ఖర్చు చేసి.. ఈ దీపాన్ని వెలిగిస్తే..?

తర్వాతి కథనం
Show comments