కృష్ణాతీరం శోభాయ‌మానం-ముగిసిన కార్తీక మాసం (video)

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (16:29 IST)
* భ‌క్తుల శివ‌నామ‌స్మ‌ర‌ణ న‌డుమ దివికేగిన పోలి....
 
* పుణ్య‌స్నానాలు, కార్తీక‌దీపాల‌తో అల‌రారిన స్నాన‌ఘాట్లు 
 
* భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో భ‌క్తుల పూజాధికాలు 
 
* కిట‌కిట‌లాడిన శైవ‌క్షేత్రాలు 
 
* ముగిసిన కార్తీక మాసం 
 
 
విజ‌య‌వాడ‌: ప‌విత్రమైన‌ కార్తీక మాసం ఆఖ‌రి రోజు (పాఢ్య‌మి తిధి)ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లోని కృష్ణా తీరం శోభాయ‌మానంగా మారింది. న‌గ‌రంలోని స్నాన ఘాట్ల‌న్ని పుణ్య‌స్నానాలు ఆచ‌రించే భ‌క్తుల‌ ర‌ద్దీతో సంద‌డి నెల‌కొంది. కార్తీక మాసం చివ‌రి రోజున భ‌క్తులు ప‌విత్ర కృష్ణా తీరంలో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజాధికాలు చేయ‌డంతో పాటు అరటిడొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదిలి పోలిని స్వ‌ర్గానికి పంపించారు. శివ‌.. శివ‌, హ‌ర‌..హ‌ర నామ‌స్మ‌ర‌ణ చేస్తూ భ‌క్తులు శివ‌కేశ‌వుల‌ను ఆరాధించారు. 
 
న‌గ‌రంలోని దుర్గాఘాట్‌, ప‌ద్మావ‌తి ఘాట్‌, పున్న‌మీఘాట్‌ల వ‌ద్ద భ‌క్తులు తెల్ల‌వారుజాము నుంచే వేలాదిగా త‌ర‌లివ‌చ్చి పుణ్య‌స్నానాలు ఆచ‌రించారు. స్నాన‌ఘాట్ల వ‌ద్ద పూజాధికాలు నిర్వ‌హించి కార్తీక దీపాల‌ను న‌దిలోకి విడిచిపెట్టారు. నింగిలోకి ఆకాశ‌దీపాలు వ‌దిలారు. ముత్తైదువులు ఒక‌రికొక‌రు వాయినాలు ఇచ్చుకున్నారు. కృష్ణ‌వేణి మాత‌కు ప‌విత్ర హార‌తులు ప‌ట్టారు. పేద‌ల‌కు వివిధ రూపాల్లో దానాలు స‌మ‌ర్పించారు. 
 
గోమాత‌ల‌కు పూజాధికాలు నిర్వ‌హించారు. రావిచెట్లు, వేప‌చెట్ల వ‌ద్ద ప‌విత్ర కార్తీక‌దీపాలు వెలిగించి భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజాధికాలు నిర్వ‌హించారు. బ్రాహ్మణులకు స్వయంపాకాన్ని దానం చేశారు. శివాల‌యాల‌న్నీ భ‌క్తుల ర‌ద్దీతో కిట‌కిట‌లాడాయి. శ్రీదుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానంలో ఉద‌యం నుంచే భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి దుర్గామ‌ల్లేశ్వ‌రుల‌ను ద‌ర్శించుకుని ప‌విత్ర కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీపాల వెలుగులో కృష్ణాతీరం శోభాయ‌మానంగా వెలుగొందింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, బెంగళూరుకి 2 గంటల్లో... రైల్లోనే...

ట్రంప్ ఏం నోటితో గ్రీన్ ల్యాండ్ కావాలని అన్నాడో కానీ... అది కాస్తా కరిగిపోతోంది, ముప్పు అంచున ప్రపంచం

చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం

జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి

Winter: తెలంగాణను వదలని చలి.. ఫిబ్రవరి చివరి వరకు వదలదట

అన్నీ చూడండి

లేటెస్ట్

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

తర్వాతి కథనం
Show comments