కాలభైరవ స్వామి గురించి?

కాలభైరవ్‌నాథ్ దేవాలయంలో కాలభైరవుడికి నైవేద్యంగా మద్యం పెడతారు. దేవుడికోసం మద్యాన్ని ఒక పాత్రలో పోసి దాన్ని విగ్రహం నోటికి అందిస్తుంటారు. ఇలా పెట్టిన మద్యం సంవత్సరం పొడవునా దేవుని దర్శనానికి వచ్చే భక్త

Webdunia
శనివారం, 7 జులై 2018 (11:02 IST)
కాలభైరవ్‌నాథ్ దేవాలయంలో కాలభైరవుడికి నైవేద్యంగా మద్యం పెడతారు. దేవుడికోసం మద్యాన్ని ఒక పాత్రలో పోసి దాన్ని విగ్రహం నోటికి అందిస్తుంటారు. ఇలా పెట్టిన మద్యం సంవత్సరం పొడవునా దేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి తమ భక్తిని చాటుకుంటారు.
 
ఈ కాలభైరవ నాథునిని తమ నగరాన్ని సంరక్షించే దేవుడిగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. కాకపోతే మద్యం సేవించడమే ఈ దేవుడి ప్రత్యేకత. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
 
కాలభైరవుని క్షేత్రపాలక అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కావలాదారి. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద ఉంచుతారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ అనురక్తితో సాకినట్లయితే పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)

AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం

Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్

Ajit Pawar, అజిత్‌ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్

RTC Conductor: ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

అన్నవరం ప్రసాదంలో నత్త.. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు

24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

తర్వాతి కథనం
Show comments