Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యక్తికి అలా వుంటే ఏలినాటి శని ఆరంభమైనట్టే...

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (05:00 IST)
శని అంటే అందరికీ భయం. క్రూరుడనీ, కనికరం లేనివాడని, మనుషుల్ని పట్టుకుని పీడించే వారని అందరూ అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జనానాం కర్మఫలోం గ్రహరూప జనార్దనః - అనే దానిని బట్టి వారి వారి కర్మానుసారం, ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చేది జనార్దనుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. 
 
ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలితాలను ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు. ఎవరు ఎలాంటి కర్మలు చేశారు, వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన ఏడు గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరచాడట. 
 
ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు. ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శని దేవుడిదేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే తమకేం చెడు జరిగినా ప్రజలు ముందు శనిని తిట్టుకుంటారు. కానీ శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒక్కటే. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామరక్ష. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలినాటి శని ఆరంభమైనట్టే.
 
శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, సత్కాలక్షేపాలు, సత్కార్యాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలే జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

తర్వాతి కథనం
Show comments