పట్టిందల్లా బంగారం అంటారు.. ఎలా సాధ్యం?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (23:21 IST)
డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ప్రస్తుత సమాజంలో డబ్బుతో సాధ్యం కానిది ఏదీ లేదు. డబ్బు లేకుండా ఏ పని జరుగదు. కొంతమంది డబ్బు సంపాదించడంలో అందరి కన్నా ముందు వరుసలో దూసుకెళుతూ ఉంటారు. వారు పట్టిందల్లా స్వర్ణమయంగా ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఎంత సంపాదించినా చేతిలో అస్సలు నిలవుదు. అలా కాకుండా చేతినిండా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి.
 
సిరుల లక్ష్మి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యం మీ దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ధనం చేకూరుతుంది. లక్ష్మీదేవి ఫోటోను దగ్గరపెట్టుకున్నా, విష్ణువు పాదాలను దగ్గర పెట్టుకున్నా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకు శనివారం తీసుకొని దానిని నీటితో శుభ్రంగా కడిగి ఆ ఆకుపై టి అని రాసి మీ దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
 
కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ ను ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది. అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది. ఎల్లో కౌరీస్ అని పిలువబడే ఒక రకమైన గవ్వలను ఏడింటిని తీసుకొని ఇంటిలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీంతో దరిద్రం మన దరిదాపుల్లో కూడా చేరదు. తామరపువ్వు విత్తనాలను చెవిలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. శ్రీ యంత్రాలను ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇలా చేస్తే డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచురకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయా... ఏనుగు పిల్ల ఆకారంలో జన్మనిచ్చిన పంది

విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి

ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే

కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

అహోబిలం నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు

తర్వాతి కథనం
Show comments